సరిలేరు నీకెవ్వరు... అప్పుడే ప్రమోషన్ మొదలు

Sarileru Neekevvaru promotion started already
Monday, August 12, 2019 - 15:15

షూటింగ్ మొదలైనప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ బాబు తో అనిల్ రావిపూడి తీస్తున్న మొదటి మూవీ..... "సరిలేరు నీకెవ్వరు". ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఇన్ఫోని అతనే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడు. ఫాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. సోమవారం నాడు విజయశాంతి సెట్లోకి అడుగుపెట్టింది అన్న న్యూస్ ని, ఫోటోని షేర్ చేసాడు. అలాగే మహేష్ బాబుకి షాట్ వివరిస్తున్న వర్కింగ్ స్టిల్ కూడా వదిలాడు. 

మిలిటరీ డ్రెస్ లో అద్భుతమైన ఫిట్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. కశ్మీర్ షెడ్యూల్ లో తీసిన వర్కింగ్ స్టిల్ ఇది. "సరిలేరు నీకెవ్వరు" సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది. 

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీలో. అయితే ఆమె ఇంకా షూటింగ్లో పార్టిసిపేట్ చెయ్యలేదు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర.. దిల్ రాజు నిర్మిస్తున్నారు.