రిలీజ్ డేట్ లేకపోవడం వ్యూహాత్మకమే!

Sarileru Neekevvaru release date
Thursday, January 2, 2020 - 19:45

"సరిలేరు నీకెవ్వరు" సినిమా సెన్సార్ పూర్తి అయింది. సెన్సార్ పూర్తి అయ్యాక రిలీజ్ డేట్ ని దర్జాగా ప్రకటించుకోవచ్చు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సెన్సార్ పోస్టర్ లో రిలీజ్ డేట్ మిస్ అయింది. జనవరి 11న విడుదల కావాలి ఈ మూవీ. ఐతే, "ఆల ఐకుంఠపురంలో" సినిమా జనవరి 12 నుంచి ...జనవరి 10కి మారుతుంది అన్న ప్రచారం నేపథ్యంలో మహేష్ బాబు టీం ... కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒకవేళ బన్నీ సినిమా ముందుకొస్తే... మహేష్ సినిమా కూడా ముందుకు వచ్చే వెసులుబాటు ఉండేలా.... రిలీజ్ డేట్ ని పోస్టర్ లో ఉంచలేదు. 

రేపు ఆల వైకుంఠపురంలో సినిమా సెన్సార్ పూర్తి అవుతుంది.

మాకు అందిన సమాచారం ప్రకారం... ఏ సినిమా డేట్ కూడా మారబోవడం లేదు. ముందు అనుకున్న డేట్స్ కే రిలీజ్ అవుతాయి. ఈ గ్యాప్ లో హడావుడి, ఎత్తుకి పై ఎత్తులు కామనే.