ఏక్ దో తీన్ రీమీక్స్‌పై కేసు వెయ్యొచ్చా?

Saroj Khan to file a case against the new Ek Do Teen remix song
Wednesday, March 21, 2018 - 22:15

"ఏక్‌దో తీన్‌.." ఒక జ‌న‌రేష‌న్‌ని ఊపేసిన పాట‌. మాధురీ దీక్షిత్ స్టార్‌డ‌మ్‌ని ఎస్టాబ్లిష్ చేసిన పాట‌. "తేజాబ్" సినిమాని తెలుగులో రీమేక్ చేసిన‌పుడు అదే పాట‌ని తెలుగులోనూ అదే ట్యూన్‌తో వాడారు. కానీ మాధురీ డ్యాన్స్ చేసినంత అందంగా తెలుగు హీరోయిన్ డ్యాన్స్ చేయ‌లేక‌పోయింద‌ని అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఐతే తెలుగులో పాట‌ని చెడ‌గొట్టార‌న్న కామెంట్ రాలేదు.

ఇపుడు "ఏక్ దో తీన్‌"కి రీమీక్స్ చేసింది. ఈ రీమీక్స్ పాట దారుణంగా ఉంద‌ని, ఒరిజిన‌ల్ పాట‌లోని అందాన్ని ఖూనీ చేశార‌ని నెటిజ‌న్‌లు ట్రాలింగ్ మొద‌లుపెట్టారు. మాధురీఎక్క‌డ‌, జాక్వెలిన్ ఎక్క‌డ‌!!

మాధురీడ్యాన్స్‌లో ఒక అందం, ఒక గ్రేస్ ఉంటుంది. మాధురీ  ముఖంలో ఒక ఇన్నోసెన్స్‌, ఒక్కో క‌ద‌లిక‌లో ఎన్నో ఎక్స్‌ప్రెష‌న్స్‌. 

జాక్వెలిన్ చేసిన ఈ పాటలో ఎక్స్‌పోజింగ్ త‌ప్ప మ‌రేమీ లేదు. అందాల‌ను ఆర‌బోయ‌డంలోచూపిన శ్ర‌ద్ద ముఖంలో హావభావాల‌పైన కానీ, డ్యాన్స్ స్టెప్పుల‌పైన కానీ పిస‌రంతైన శ్ర‌ద్ద పెడితే బాగుండేది అనే విమ‌ర్శ వ‌స్తోంది. ఇక "తేజాబ్" సినిమాని డైర‌క్ట్ చేసిన ద‌ర్శ‌కుడు ఎన్‌.చంద్ర‌, ఆ పాట‌ని కంపోజ్ చేసిన గ్రేట్ డ్యాన్స్ మ్యాస్ట‌ర్ స‌రోజ్ ఖాన్ ఇద్ద‌రూ "భాగీ 2" సినిమా మేక‌ర్స్‌పై మండిప‌డుతున్నారు. జాక్వెలిన్‌పై ఈ పాట తీసినందుకు కేసు వేయాల‌న్నంత‌ క‌సిగాఉంద‌ని చెపుతున్నారు. 

అమెరికాలోని సెంట్ర‌ల్ పార్క్‌ని సాదాసీదా బొటానిక‌ల్ గార్డెన్‌ని చేసిన‌ట్లుగా ఉంద‌ని స‌రోజ్‌ఖాన్ కోపంగా ఊగిపోతున్నారు.