13 రోజుల్లో 47 డేస్

Satya Dev's 47 Days to stream on June 30
Wednesday, June 17, 2020 - 22:15

తమిళ్, హిందీతో పోలిస్తే తెలుగులో ఓటీటీ రిలీజ్ లు తక్కువగా ఉన్నాయి. అప్పుడెప్పుడే జీ5లో "అమృతారామమ్" అనే సినిమా నేరుగా రిలీజైంది. పేరుకు అది మొట్టమొదటి తెలుగు ఓటీటీగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అందులో చెప్పుకోదగ్గ తారాగణం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు మరో తెలుగు మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాని పేరు "47డేస్".

సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాను జీ5ను దక్కించుకుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 30న "47డేస్" సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది జీ5 సంస్థ. అంటే మరో 13 రోజుల్లో విడుదల కానుంది "47 డేస్".

"47డేస్" స్ట్రీమింగ్ కు వచ్చేసరికి కీర్తిసురేష్ నటించిన "పెంగ్విన్" సినిమా అల్రెడీ ఓటీటీలో రిలీజై ఉంటుంది. సో.. సత్యదేవ్ మూవీ వచ్చిన తర్వాత ఈ రెండు సినిమాల్లో ఏది బెటర్ అనే విషయం తేలిపోతుంది. అప్పటికి మరిన్ని తెలుగు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యే అవకాశం ఉంది.

అనుష్క నటించిన "నిశ్శబ్దం", రాజ్ తరుణ్ నటించిన "ఒరేయ్ బుజ్జిగా" సినిమాలు ఓటీటీ వైపు వెళ్లాలా వద్దా అనే డైలమాలో ఉన్నాయి. "పెంగ్విల్", "47డేస్" రిలీజయ్యే టైమ్ కు వీటిపై కూడా ఓ క్లారిటీ రావడం గ్యారెంటీ.