మనకూ ఒక ఓటీటీ హీరో దొరికాడోచ్

Satyadev is turning OTT star of Tollywood
Saturday, June 20, 2020 - 13:45

బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ కు మంచి ఇమేజ్ ఉంది. కానీ అతడు ఉన్నఫలంగా ఓటీటీ హీరోగా మారిపోయాడు. వివేక్ ఒబెరాయ్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటులు కూడా ఇప్పుడు ఓటీటీ హీరోలైపోయారు. లేటు వయసులో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడీ దిశగా తెలుగులో కూడా ఓటీటీ హీరో ఒకడు తయారవుతున్నాడు. అతనే సత్యదేవ్.

టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు నటించిన సినిమాలు రెండు ఒకేసారి ఓటీటీలోకి వస్తున్నాయి. గతేడాది సత్యదేవ్ చేసిన "47-డేస్" అనే సినిమా ఈనెలాఖరుకు ఓటీటీలోకి రాబోతోంది. సత్యదేవ్ నటించిన తాజా చిత్రం "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" కూడా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.

ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తే సత్యదేవ్ టాలీవుడ్ ఓటీటీ హీరోగా అవతరించడం ఖాయం. ప్రస్తుతం సత్యదేవ్ కు మంచి డిమాండ్ ఉంది. బాగా నటిస్తాడనే గుర్తింపుతో పాటు.. నిర్మాతలకు అందుబాటులో ఉంటాడనే ఇమేజ్ ఉంది. ఇప్పుడు దీనికితోడు ఓటీటీ మార్కెట్ కూడా కలిసొస్తే.. సత్యదేవ్ దశ తిరిగినట్టే.