మహేష్ సినిమాకి కథా కసరత్తు

Script is being readied for Mahesh Babu's next
Monday, February 3, 2020 - 17:15

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ విజయం సాధించింది. సినిమా ఫక్తు మసాలా మూవీ. అనిల్ రావిపూడికి దర్శకుడీగా మార్కులు పడలేదు. ఇంకా చెప్పాలంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయి. అయినా ...సినిమా ఎలా ఆడింది? ఒకటి సీజన్ అడ్వాంటేజ్, రెండోది మహేష్ బాబు స్టార్ డమ్, మూడోది టికెట్ ధరలు భారీగా పెరగడం. అలాగే, ఈ సరి లక్ కూడా తోడైయ్యింది. అయితే, అన్ని సార్లు ఇది కుదరదు కదా. అందుకే తన తదుపరి చిత్రం కథ విషయంలో మహేష్ బాబు గట్టిగా ఉన్నాడట. 

మహర్షి తీసిన వంశీ పైడిపల్లికే మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు మహేష్. అయితే, స్క్రిప్ట్ విషయంలో రాజీ పడొద్దని చెప్పి మరి అమెరికా వెళ్ళాడు ఈ సూపర్ స్టార్. త్వరలోనే హైదరాబాద్ వస్తాడు మహేష్. రాగానే కథ కసరత్తులో పాల్గొంటాడు. 

ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. "మ‌హేష్ నెక్ట్స్ సినిమా మాదే. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అంతా ఓకే అయిన త‌ర్వాత సినిమా టేకాఫ్ అవుతుంది," అని దిల్ రాజు చెప్పారు. అయితే, మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు అని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.