సూర్య కొంపముంచిన రాఘవ

శ్రీరాఘవ (సెల్వ రాఘవన్) మరో రాంగోపాల్ వర్మలా మారాడాని చాలా కాలం నుంచే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకపుడు గొప్ప సినిమాలు తీసిన వర్మ ఇపుడు ఎంత నాసిరకం, ఎంతో పరమ బోర్ సినిమాలు తీస్తున్నాడో చూస్తున్నాం. ఎపుడో 7జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకి అర్థాలు వేరులే తీసిన శ్రీరాఘవ ఆ రెండింటి పేరు చెప్పుకొనే కాలం వెళ్లదీస్తున్నాడు.
ఆ తర్వాత ఆయన తీసిన వర్ణ (అనుష్క, ఆర్య జంటగా నటించారు) భారీ డిజాస్టర్. నిర్మాత పీవీపికి 30 కోట్లు నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఆయన భార్య డైరక్షన్ సినిమాకి కథ, మాటలు ఇచ్చాడు. అది ఆడలేదు. ధనుష్‌తో ఒక సినిమా మొదలుపెడితే అది అటకెక్కింది. అలాంటి టైమ్‌లో సూర్య ఏ మూడ్‌లో ఉండి శ్రీరాఘవ సినిమా ఒప్పుకున్నాడో ఆయనకి తెలియాలి. వీరి కాంబినేషన్‌లో రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఎన్.జె.కే ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.
"ఎన్.జి.కే" ట్రయిలర్ చూసే అందరూ దడుసుకున్నారు. ఇక ఇపుడు థియేటర్లలో ప్రేక్షకుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. సూర్య కెరియర్‌లోనే అత్యంత బోరింగ్ మూవీగా క్రిటిక్స్ అభివర్ణించారు. 1 నుంచి 1.5 రేటింగ్ ఇచ్చారు. అంటే ఎంత పరమ చెత్తగా ఉందో స్పెషల్‌గా మెన్సన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లుగా సూర్యకి కథల జడ్జిమెంట్ ఉండడం లేదు. సింగం సిరీస్‌లో వచ్చిన సినిమాలు తప్ప గత ఐదారేళ్లల్లో సూర్య నటించిన సినిమా ఆడింది లేదు తెలుగునాట. తమిళనాట కూడా విజయ్, అజిత్ వంటి సూపర్‌స్టార్‌లకి కిలోమీటర్ల దూరంలో వెనకబడి ఉన్నాడు. ఇలాంటి కథలు ఒప్పుకుంటే అలాగే ఉంటుంది మరి.
- Log in to post comments