సీనియర్ నటి కొడుక్కి కొరోనా?

Senior actress's son tested COVID19 Positive
Wednesday, May 20, 2020 - 14:15

టాలీవుడ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఐతే సైలెంట్ గా చికిత్స చేసుకొని కోలుకున్నారు అనే టాక్ నడుస్తోంది. అందులో పక్కాగా వినిపిస్తున్న పేరు... ఒక సీనియర్ నటి కొడుకు. మొదటి దశ లాక్డౌన్ లోనే అతనికి పాజిటివ్ అని తేలిందట. ఐతే వెంటనే క్వారంటైన్ లో ఉన్నాడు. చికిత్స కూడా జరిగింది. పూర్తిగా కోలుకున్నాడట.

పేషెంట్ ల పేరు విషయంలో గోప్యత పాటించాలి. కాబట్టి అతని పేరు బయటకి రాలేదు. అమెరికాలో, ఇతర దేశాల్లో పేరొందిన సెలబ్రిటీస్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ఆ విషయాన్ని బహిరంగ పర్చారు. చికిత్స పొంది కోలుకున్నారు. ఐతే, ఈ నటి కొడుకు మాత్రం ఆ ప్రచారం వద్దని అనుకున్నాడట. సింపుల్ లైఫ్ అంటే అతనికి ఇష్టం.

ఐతే, మొత్తానికి కోలుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో అది గుడ్ న్యూస్.