వారి జాత‌కాలు బ‌య‌ట‌పెడుతా: ష‌కీల‌

Shakeela biopic to have dirty secrets
Thursday, November 15, 2018 - 11:45

ష‌కీల బ‌యోపిక్ కూడా విడుద‌ల‌కి సిద్ద‌మ‌వుతోంది.  బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా ష‌కీల పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కొత్త స్టిల్స్ విడుద‌ల అయ్యాయి. ష‌కీల లైఫ్‌లాగే ఈ సినిమా కూడా చాలా స్పైసీగా ఉంటుంద‌ట‌. ఆమెని వాడుకొని వ‌దిలేసిన ఎంద‌రో స్టార్స్ గురించి ఈ సినిమాలో చూపించ‌నున్నారు. 

న‌న్ను మోసం చేసిన వారి బండారం బ‌య‌ట‌పెడుతా అని ఇటీవ‌లే ష‌కీల ప్ర‌క‌టించింది. తెలుగునాట పుట్టి మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో స్టార్‌గా ఎదిగిన ష‌కీల ఒక‌పుడు పెద్ద‌ల‌కు మాత్ర‌మే సినిమాల‌కి క్వీన్‌. ఒక ద‌శ‌లో మ‌మ్మూట్టి, మోహ‌న్‌లాల్ సినిమాల‌ని కూడా చూడకుండా ష‌కీల సినిమాలే చూడ‌డం మొద‌లుపెట్టారు మ‌ల‌యాళీలు. ఆమె స్టార్‌డ‌మ్‌ని త‌ట్టుకోలేక ఎన్నో కుట్ర‌లు జ‌రిగాయ‌ట‌. అవ‌న్నీ ఈ సినిమాలో బ‌య‌ట‌పెడుతానంటోంది. 

తెలుగు ఫిల్మ్‌మేక‌ర్స్, న‌టులు కూడా ఆమెని కెరియ‌ర్ ప్రారంభంలో మోసం చేశార‌ట‌. వారి గురించి కూడా ఉంటుంద‌ట‌. మ‌రి ఇంత‌కీ వారెవ్వ‌రో!