షకీలా సినిమా 50 రూపాయలే!

Shakeela presents Ladies Not Allowed for Rs 50 per view
Friday, July 17, 2020 - 15:30

పూరి జగన్నాధ్ స్టయిల్ లో చెప్పాలంటే ఈ కరోనా అందరి దూల తీర్చేస్తోంది. దాదాపు సినీ జనాలందరిపై కరోనా ప్రభావం పడింది. తనపై ఇంకాస్త ఎక్కువ పడిందంటోంది నటి షకీలా.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. "లేడీస్ నాట్ ఎలౌడ్" అనే సినిమాను నిర్మించింది షకీలా. మూవీ మూడేళ్ల కిందటే రెడీ అయింది కానీ సెన్సార్ వల్ల ఇన్నాళ్లూ రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు కరోనా వల్ల తన రిలీజ్ కష్టాలు మరింత పెరిగాయంటోందీమె.

"నా మొత్తం సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ సినిమా తీశాను. సేవింగ్స్ కాకుండా వడ్డీకి డబ్బులు తెచ్చాను. ప్రస్తుతానికి వడ్డీలు కట్టనక్కర్లేదని ప్రభుత్వం చెప్పినా నా ఫైనాన్షియర్లు ఒప్పుకోలేదు. చాలా ఒత్తిడి పెరిగిపోయింది."

బాగా అలిసిపోయిన షకీలా ఇక సెన్సార్ ఫార్మాలిటీస్ పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. "లేడీస్ నాట్ ఎలౌడ్" అనే సైట్ క్రియేట్ చేసి అందులో అదే పేరుతో తన సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. తన సినిమాకు 50 రూపాయల టిక్కెట్ రేటును ఫిక్స్ చేసిన షకీలా.. ఫుల్ గా శాటిసిఫై  అవ్వొచ్చని చెబుతోంది. రూ.50 పెట్టి తృప్తి పొందండి అని చెప్తోంది షకీలా. వర్మ తీసున్న "నేకిడ్" సినిమాల కన్నా చాలా సరసమైన ధర. మహిళలు మాత్రం ఈ సినిమా చూడొద్దని రిక్వెస్ట్ చేస్తోంది