నన్ను లవ్ చేయాలి.. కంట్రోల్ కాదు

Shakeela talks about her past love
Sunday, October 20, 2019 - 19:00

అలనాటి శృంగార తార షకీలా మరోసారి బోల్డ్ గా మాట్లాడేసింది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని ఈవిడ, దానికి కారణాలు వివరించింది. పెళ్లి చేసుకుంటే భర్త చెప్పినట్టు వినాలని, అది తనకు ఇష్టం లేదని అంటోంది షకీలా. అందుకే పెళ్లి చేసుకోలేదట. కానీ తన జీవితంలో లవ్ ఎఫైర్స్ మాత్రం ఉన్నట్టు స్పష్టంచేశారామె.

"నాకు దాదాపు 7-8 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సరిగ్గా గుర్తులేదు కానీ ఓ 10 మంది వరకు ఉంటారు. వాళ్లంతా దాదాపు పెళ్లి వరకు వచ్చారు. కానీ నేనే ఆ ప్రపోజల్స్ ను తిరస్కరించాను. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడే వాళ్లు కండిషన్స్ పెట్టారు. ఇక పెళ్లయితే నన్ను స్వతంత్రంగా ఉండనివ్వరు. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు."

నిజానికి 22 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని, అతడ్నే పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పానని తెలిపింది షకీలా. కానీ తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమెపై కోపంతో పెళ్లి చేసుకోలేదట. తర్వాత అదే అలా అలవాటు అయిపోయిందని చెబుతోంది షకీలా.

తనను లవ్ చేసే వాళ్లు కావాలని, కానీ ప్రేమ-పెళ్లి పేరిట కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం తనకు ఇష్టముండదని అంటోంది షకీలా. ఇప్పటికీ తనను ప్రేమించేవాళ్లు ఉన్నారని, గతంలో తనను ప్రేమించిన వాళ్లు కూడా ఇప్పటికీ టచ్ లో ఉన్నారని చెబుతోంది.