షకీలా... ఏందీ ఈ గోల!

Shakeela talks about piracy
Monday, July 27, 2020 - 19:15

ఈ సినిమావాళ్లు ఒక్కోసారి మరీ అతి చేస్తారు. వాళ్లు తీసిన సినిమానే ఆణిముత్యం అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తారు. ప్రమోషన్ కోసం అలా చేస్తారా.. లేక సినీజనాల మనస్తత్వమే అంతా అనేది ఎవ్వరికీ అర్థం కాదు. తాజాగా ఈ లిస్ట్ లోకి నటి షకీలా చేరిపోయింది.

ఈమె నిర్మాతగా మారి ఈమధ్య ఓ సినిమా తీసింది. దాని పేరు "లేడీస్ నాట్ ఎలౌడ్". టైటిల్ చూస్తేనే సినిమా కంటెంట్ ఏంటనే విషయం అర్థమౌతుంది. ఈ సినిమా ఎంత పచ్చిగా ఉంటుందంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు తిరిగినా సెన్సార్ అవ్వలేదు. ఇప్పుడీ సినిమా పైరసీ అయిందని గోల పెడుతోంది షకీలా.

రీసెంట్ గా ఈ మూవీని వెబ్ లో రిలీజ్ చేసింది షకీలా. మూవీకి 50 రూపాయల టిక్కెట్ ధర నిర్ణయించింది.  అయితే ఎవ్వరూ టిక్కెట్టు పెట్టి తమ సినిమా చూడడం లేదని, అంతా పైరసీ సైట్స్ లో చూస్తున్నారని మండిపడింది. ఈ మేరకు పైరసీ చేసినవాళ్లను తిడుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

పైరసీ చేయడం తప్పే. కానీ "లేడీస్ నాట్ ఎలౌడ్" అనే సినిమా పైరసీకి కూడా పనికిరాని సినిమా.... ఇంత బోరింగ్ గా ఉందని టాక్. ఈ సినిమాను ఉచితంగా చూపించినా ఎవ్వరూ చూడరు అంటూ చూసినోళ్లు కామెంటేడుతున్నారు. అలాంటి సినిమాను పైరసీ చేశారంటూ బాధపడుతోంది షకీలా. తనకు డబ్బులు రావడం లేదని తెగ ఇదైపోతోంది.