అర్జున్‌రెడ్డి భామ జీవిత పాఠాలు!

Shalini Pandey shares life lessons
Thursday, November 15, 2018 - 00:30

పై ఫోటో చూసి ఈ అమ్మాయి ఇంత దిలాసాగా ప‌డుకుందేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అదే ఆమె లైఫ్ ఫిలాస‌ఫీ (ట‌). అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపుల‌ర్ అయిన షాలిని పాండే కొన్ని జీవిత పాఠాల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 

రూల్స్ అన్నిటిని ప‌క్క‌న పెట్టండి (బూతు మాట ఉప‌యోగించిందిక్క‌డ‌) అంటోంది. గ‌త రెండేళ్లుగా తాను ఇదే చేస్తున్నా అని చెపుతోంది.

"తినండి, ఎక్సర్‌సైజ్ చేయండి, నిద్ర‌పొండి, పుస్త‌కాలు చ‌ద‌వండి, లేజీగా తిర‌గండి, సింపుల్‌గా అపుడపుడు ఏ ప‌ని చేయ‌కుండా కూర్చొండి, ఫోన్ ప‌క్క‌న పెట్టండి, బెడ్ మీద నుంచి కింద దిగకండా.. సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఏమి చేయాల‌నుకుంటున్నావో అదే చెయ్యి. రూల్స్‌కి బ్రేక్ వెయ్యి."

ఇలా చేస్తే జీవితం సూప‌ర్‌గా ఉంటుంద‌ట‌. రెండేళ్లుగా అంటే అర్జున్‌రెడ్డి విడుద‌ల‌కి ముందు నుంచి ఇదే ప‌ని చేస్తోంద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న ఒక థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తోంది. త‌మిళంలో 100 ప‌ర్సెంట్ ల‌వ్ రీమేక్‌లో జీవి ప్ర‌కాష్ స‌ర‌స‌న న‌టించింది.