పారితోషికాన్ని వ‌దులుకుఅంటున్న శంక‌ర్‌

Shankar reduces remuneration for Bharateeyudu 2
Wednesday, August 7, 2019 - 08:30

"భార‌తీయుడు 2" సినిమా ఆగిపోయింది. ఇది నిజమే. జనవరిలో 15 రోజులు షూటింగ్ చేసి ఆపారు. బ‌డ్జెట్ ఎక్కువ అవుతోంద‌ని నిర్మాత‌లు సినిమాని పక్కన పెట్టారు. ఈ గ్యాప్ లో శంకర్ ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసినా, వర్కౌట్ కాలేదు. ఈ సినిమాని పక్కన పెట్టి వేరే మూవీ చేద్దామనుకున్నారు. 

ఐతే ఇప్పటికిపుడు మ‌రొ సినిమా చేసేందుకు శంక‌ర్‌కి హీరోలు ఎవ‌రూ దొర‌క‌లేదు. దాంతో భార‌తీయుడు 2 నిర్మాత‌ల‌ను ఒప్పించి... త‌న పారితోషికం స‌గం త‌గ్గించుకున్నాడు. ఈ స‌గం కూడా సినిమా విడుద‌లై హిట్ట‌యిన త‌ర్వాతే ఇవ్వండి అని చెప్పాడు. ఇలా కాంప్ర‌మైజ్ అయ్యాడు శంక‌ర్‌.

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్. సిద్ధార్థ్, రకుల్ మరో జంట. సినిమాకి హైప్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.