ఓటీటీలోకి స్టార్ హీరోలు వస్తారా?

Sharat Marar is confident big stars will also enter OTT space
Sunday, July 19, 2020 - 18:30

ప్రస్తుతానికి ఇదొక సమాధానం లేని ప్రశ్న. చిన్నాచితకా హీరోలే తమ సినిమాల్ని థియేటర్లు కాదని, ఓటీటీపైకి తీసుకురావడానికి అభ్యంతరం చెబుతున్నారు. ఇక స్టార్ హీరోలు ఎందుకొస్తారు? ఒకవేళ వచ్చినా భారీ బడ్జెట్ సినిమాకు ఓటీటీలో ఆ స్థాయిలో లాభాలు వస్తాయా? వీటన్నింటికీ నిర్మాత శరత్ మరార్ సమాధానం చెబుతున్నారు.

"ఓటీటీలో ఇప్పుడే మూమెంట్ వచ్చింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద హీరోలు వస్తారు. ఎందుకంటే రీచ్ పెరిగేకొద్దీ బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ పెరిగితే పెద్ద డైరక్టర్లను అప్రోచ్ అవ్వొచ్చు. పెద్ద హీరోలు కోరుకునేది ఇదే కదా. కచ్చితంగా అంతా వస్తారు. రాబోయే రోజుల్లో చూస్తాం."

టాలీవుడ్ కు సంబంధించి ఈ నిర్మాత పూర్తిగా ఓటీటీ వైపు షిఫ్ట్ అయ్యాడు. ఆల్రెడీ భానుమతి అండ్ రామకృష్ణ అనే ఒరిజినల్ మూవీని ప్రొడ్యూస్ చేసిన ఈ నిర్మాత.. రాబోయే రోజుల్లో తను పూర్తిగా ఓటీటీపైనే వర్క్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఈటీవీ విన్, జీ5.. ఇలా అన్ని ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు శరత్ మరార్. ఒరిజినల్ మూవీస్ కంటే వెబ్ సిరీస్ లు ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాడు. ఇదే ఊపులో భవిష్యత్తులో ఓ పెద్ద హీరోతో ఓటీటీ కోసం ఓ ఎక్స్ క్లూజివ్ మూవీ కచ్చితంగా తీస్తానని నమ్మకంగా చెబుతున్నాడు.