మరోసారి పోలీస్ పాత్రలో

Sharwanand to appear as a police officer
Saturday, July 4, 2020 - 16:00

శర్వానంద్ మరోసారి ఖాకీ చొక్కా వేసుకోబోతున్నాడు. ఇప్పటికే "రాథ" సినిమాలో కామెడీ కాప్ గా కనిపించిన ఈ హీరో.. ఈసారి మాత్రం ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఈ మేరకు ఓ కొత్త దర్శకుడికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

శ్రీరామ్ అనే కొత్త కుర్రాడు చెప్పిన స్టోరీలైన్ శర్వాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుందట. పోలీస్ స్టోరీ అయినప్పటికీ చాలా కొత్తగా ఉంటుందట. నెరేషన్ నచ్చిన శర్వానంద్ సినిమా చేస్తానని అతడికి మాటిచ్చాడు. బ్యానర్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది డౌట్. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా ఆగిన శ్రీకారం సినిమాను శర్వా ఇప్పుడు పూర్తిచేయాలి. దీంతో పాటు తెలుగు-తమిళ భాషల్లో చేస్తున్న ఓ ద్విభాషా చిత్రాన్ని కూడా అతడు కంప్లీట్ చేయాలి.

ఈ రెండు పూర్తిచేసిన తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది. అప్పటికి గానీ ఈ కొత్త దర్శకుడి సినిమాకు మోక్షం రాకపోవచ్చు.