ఇక శర్వానంద్ ఆట షురూ

Sharwanand to do agressive promotion
Friday, August 9, 2019 - 01:15

శర్వానంద్ ఆ మధ్య తీవ్రంగా గాయపడ్డాడు. భుజానికి సర్జరీ జరిగింది. ఐతే శర్వా వేగంగా కోలుకున్నాడు. ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఐతే ఇప్పటి వరకు "రణరంగం" సినిమాకి సంబంధించి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. మొన్న కాకినాడలో ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ తప్ప అసలు హంగామా మొదలు పెట్టలేదు.

"రణరంగం" సినిమా అతనికి కీలకం. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన "పడి పడి లేచే మనసు" కెరియర్ గ్రాఫ్ ని పూర్తిగా పడేసింది. సో... "రణరంగం" సినిమా హిట్ కావాలి. అంతేకాదు...ఫ్యామిలీ, రొమాన్స్ సినిమాల ట్రాప్ లో పడ్డ శర్వానంద్ అందులో నుంచి బయటపడాలనుకుంటున్నాడు. రణరంగం సినిమా ఆడితేనే... శర్వాతో మరికొన్ని యాక్షన్ సినిమాలు ప్లాన్ చేసేందుకు నిర్మాతలకి ధైర్యం వస్తుంది. లేదంటే వెరైటీ జానర్స్ ట్రై చేయడానికి శర్వాకి ఆస్కారం నిల్.

ఈ సినిమా విషయంలో కొంచెం ఎక్కువ ప్రమోషన్ ఆట ఆడనున్నాడు.