శర్వానంద్ కి ట్రోలింగ్ భయం

Sharwanand is fearing trolling
Wednesday, February 5, 2020 - 12:30

శర్వానంద్ జంకుతున్నాడా?
హీరో శర్వానంద్ కి వరుసగా రెండు దెబ్బలు తగిలేసరికి భయం పట్టుకుంది. సినిమా ఫలితం చూసాక మాట్లాడుదాం... ముందే హడావిడి ఎందుకు అన్న థాట్ లోకి వచ్చాడు. అది కాకుండా ట్రోలింగ్ భయం ఉంది శర్వకి. ఈ ఫ్రైడే రిలీజ్ అవుతోన్న జాను సినిమా... తమిళంలో సూపర్ హిట్టైన '96' సినిమాకి రీమేక్. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ఇరగదీశాడు. ఆ రోల్ లో నటించాడు శర్వా. అయితే, రిలీజ్ తర్వాత సేతుపతితో పోల్చి తనను ట్రోల్ చేస్తారేమో అని శర్వాకి ఒక డౌట్ మొదలైంది. అందుకే.. ఈ సినిమా గురించి ఎక్కవ మాట్లాడడం లేదు. 

సమంతకి ఆ భయం లేదు. కానీ శర్వకి మాత్రం... అసలే మన టైం బాగాలేదు ఇప్పుడు కాస్త మౌనంగా ఉంటే బెటర్ అన్నట్లు ఉంది. 

రీమేక్ లు అనగానే ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు అంతా ట్రోలింగ్ కి భయపడుతున్నారు. ఒరిజినల్ సినిమా తో పోల్చుతారేమో అనేది అందరి ఫియర్.