శర్వానంద్ కి ఎఫైర్లు లేవంట

Sharwanand has no love affairs
Tuesday, February 4, 2020 - 18:15

నితిన్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నిఖిల్ కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రభాస్ కూడా రేపోమాపో అన్నట్టున్నాడు. ఇలాంటి టైమ్ లో శర్వానంద్ మీడియా ముందుకొస్తే, పెళ్లి ప్రస్తావన రాకుండా ఉంటుందా.. అదే జరిగింది. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న శర్వానంద్ కు ఎదురైంది. అయితే శర్వా మాత్రం చాలా తెలివిగా తప్పించుకున్నాడు.

"ఫస్ట్ లవ్ తోనే ఆగిపోయాను. మజిలీలో సమంత లాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను."

చుశారుగా.. ఇది శర్వానంద్ రిప్లయ్. తన లైఫ్ లో ప్రేమ అనే పదార్థమే లేదంటున్నాడు శర్వానంద్. ఆ వెంటనే పక్కనే ఉన్న సమంత కూడా అందుకుంది. శర్వాకు ఎలాంటి ఎఫైర్లు లేవనే విషయాన్ని స్పష్టంచేసింది. ఇంకా చెప్పాలంటే శర్వా అంత బోరింగ్ కేండిడేట్ ఎవ్వరూ ఉండరంటోంది శామ్.

"నాకు చాలా డౌట్. ఇన్నాళ్లు ఎలా సింగిల్ గా ఉన్నాడు. ఓసారి గూగుల్ కూడా చేశాను. శర్వా లింకప్స్ అని సెర్చ్ చేశా. ఏం రాలేదు. బోరింగ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ శర్వా," ఇలా శర్వా లవ్ లైఫ్ పై స్పందించింది సమంత. 

నిజంగా లేవా, లేక మీడియా కంట పడకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నాడా అన్నదే ప్రశ్న.