ఇప్పుడు హ్యాపీ అంటున్న శర్వానంద్

Sharwanand is now happy
Saturday, February 8, 2020 - 17:15

క్రిటిక్స్ ఏమంటారో... అని శర్వానంద్ చాలా భయపడ్డాడట. విజయ్ సేతుపతి నటనతో పోల్చి ట్రోల్ చేస్తారేమో అని టెన్షన్ పడ్డాడు. ఐతే, జాను రిలీజ్ తర్వాత చిత్రంగా సమంతతో పాటు తనకి కూడా ప్రశంసలు దక్కుతుండడంతో ఉబ్బితబ్బిబు అవుతున్నాడు. 

తమిళ్ లో 96లో విజయ్ సేతుపతి నటించాడు. ఆ పాత్రకు అతడు ప్రాణం పోశాడు."విజయ్ సేతుపతిని మ్యాచ్ చేయగలనా లేదా అనే అనుమానం దాదాపు 20 రోజుల పాటు ఉంది. ఎప్పుడైతే దర్శకుడు ప్రేమ్ కుమార్, బ్యాక్ స్టోరీస్ చెబుతూ.. క్యారెక్టర్ పై డీటెయిలింగ్ గా చెప్పాడో అప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. అయితే ఎంత ధైర్యంగా చేసినప్పటికీ, రిజల్ట్ పై మాత్రం భయం ఉందని, ప్రేక్షకులు-సమీక్షకులు కచ్చితంగా విజయ్ సేతుపతితో పోలుస్తారని  అనుకున్నాను," అని చెప్పుకొచ్చాడు శర్వానంద్. సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కడంతో ఇప్పుడు హ్యాపీ ఉందంటున్నాడు.

సినిమాకి క్రిటిక్స్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చినా.... సరి అయిన ప్రమోషన్ చేయలేకపోవడంతో ఓపెనింగ్స్ సాదాసీదాగా వచ్చాయి. ఇప్పుడు పికప్ అవ్వాలి.