గ్యాంగ్ స్టర్ సినిమాలో లవ్ నచ్చిందట

Sharwanand says he liked love track in Ranarangam
Saturday, August 17, 2019 - 08:30

"రణరంగం"... ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ గా శర్వా లుక్ కూడా చాలా బాగుంది. రేటింగ్స్ తో సంబంధం లేకుండా అంతా కామన్ గా చెప్పిన పాయింట్స్ ఇవి. ఇలాంటి హై-ఇంటెన్స్ సినిమాలో యాక్షన్ బాగుందని ఎవరైనా చెప్పుకొస్తారు. కానీ శర్వానంద్ కు మాత్రం ఈ సినిమాలో లవ్ ట్రాక్ నచ్చిందట. 

స్వయంగా రెండు డిఫరెంట్ షేడ్స్ పోషించిన ఈ హీరో, సినిమాలో తన గెటప్ కంటే తనపై తీసిన లవ్ ట్రాక్ బాగా నచ్చిందని చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ శర్వ మాత్రం తన మాటకే కట్టుబడి ఉన్నాడు. ఇప్పటివరకు తను చేసిన ప్రేమ సినిమాలన్నింటిలో ది బెస్ట్ లవ్ ట్రాక్ రణరంగంలోనే ఉందంటున్నాడు.

"ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది."

ప్రస్తుతం ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. పూర్తిగా యాక్షన్ సినిమా అనే విధంగా ప్రచారం చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి దూరమయ్యారని యూనిట్ భావిస్తోంది. అందుకే శర్వానంద్ ఇలా ప్రేమ పల్లవి అందుకున్నాడని అంటున్నారు క్రిటిక్స్. ఈ 2 రోజుల్లో ఈ సినిమా పూర్తి ఫలితం తేలిపోతుంది.