జాను వల్ల శర్వా మరో చిక్కు

Sharwanand's new film faces new trouble
Saturday, February 22, 2020 - 11:15

ఓ సినిమా ఫ్లాప్ అయితే దాని ప్రభావం నెక్ట్స్ మూవీపై కచ్చితంగా పడుతుంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ప్రభావం విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్ పై ఇప్పటికే పడింది. సరిగ్గా ఇలాంటి ప్రభావాన్నే ఇప్పుడు మరో హీరో శర్వానంద్ కూడా చవిచూస్తున్నాడు. జాను సినిమా ఫ్లాప్ అవ్వడంతో... అతడు నటిస్తున్న శ్రీకారం సినిమాకి కొత్త చిక్కు వచ్చింది. 

శ్రీకారం సినిమా దాదాపు రెడీ అయింది. ఇంకొక్క షెడ్యూల్ తో సినిమా టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. కానీ  శాటిలైట్ డీల్ ఇంకా లాక్ అవ్వకపోవడం 14 రీల్స్ ప్లస్ నిర్మాతల్ని ఇరకాటంలో పడేసింది. జాను పేరు చెప్పి శాటిలైట్ కంపెనీలు బేరాలు మొదలెట్టాయంట అందుకే  శర్వా ఇకపై జాగ్రత్తగా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలి. 

ఈ సినిమాను ఏప్రిల్ 24న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ఐతే ఆ డేట్ మారొచ్చని మాట వినిపిస్తోంది.