ఇదేం వైల్డ్ కార్డ్ స్వామీ!

Shilpa Chakravarthy as wild card entry into Bigg Boss, trollers have field time
Tuesday, September 3, 2019 - 15:45

వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. పేరులోనే ఫైర్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే అదిరిపోవాలి. హాట్ గా ఉండాలి. చూసిన ప్రేక్షకులు వావ్ అనుకోవాలి. కానీ బిగ్ బాస్ సీజన్-3లో వస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను చూస్తే యాక్ అనుకోవాల్సి వస్తోంది. ముందుగా ట్రాన్స్ జెండర్ తమన్న సింహాద్రి వచ్చింది. హౌజ్ ను రచ్చ రచ్చ చేసి వెళ్లింది. ఇక రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరో వస్తారనుకుంటే ఫేడ్ అవుట్ అయిన యాంకర్ శిల్పా చక్రవర్తి వచ్చి చేరింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీపై 10 రోజులుగా సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. హెబ్బా పటేల్ వస్తుందని చాలామంది అనుకున్నారు. శ్రద్ధాదాస్ వస్తుందంటూ పుకార్లు వచ్చినప్పటికీ వాటిని ఆమె వెంటనే ఖండించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా పేరు కూడా వినిపించింది. ఇలా అంతా హీరోయిన్ల గురించి ఆలోచిస్తున్న టైమ్ లో నిర్వహకులు మాత్రం చీప్ గా శిల్పా చక్రవర్తిని హౌజ్ లోకి పంపించారు. 

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-3 బోర్ అంటూ కామెంట్స్ పడుతున్నాయి. వీకెండ్స్ మినహాయిస్తే మిగతా రోజుల్లో అసలు పస ఉండడం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని వీక్లీ రేటింగ్స్ కూడా ధృవీకరిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో హాట్ భామల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపించి ఉంటే బాగుండేది. నిజానికి కాస్త డబ్బులిస్తే హౌజ్ లోకి వెళ్లడానికి హాట్ బ్యూటీస్ చాలామంది రెడీగా ఉన్నారు. సినిమా ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది ముద్దుగుమ్మలు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. 

కానీ నిర్వహకులు మాత్రం కాస్ట్ కటింగ్ కు వెళ్లినట్టున్నారు. హీరోయిన్ స్థానంలో పాతపడిన యాంకర్ ను పంపించారు. చూస్తుంటే.. శిల్పా చక్రవర్తి ఎంట్రీ వెనక ఏదో పెద్ద రాజకీయమే నడిచినట్టు కనిపిస్తోంది. లేకపోతే ఆమెకు అవకాశం రావడం ఏంటి