టబు నుంచి శిల్పకి వచ్చారా?

Shilpa Shetty's name being considered for Andhadhun Telugu remake?
Tuesday, June 9, 2020 - 23:45

మొదట టబు అనుకున్నారు. ఆ తర్వాత అనసూయ వైపు మొగ్గారు. కొన్నాళ్ళకు రమ్యకృష్ణ ఖరారు అయిందని వార్తలు వచ్చాయి. కరోనా లక్డౌన్ తర్వాత సీన్ మారింది. మళ్లీ కొత్త నేమ్ బయటికొచ్చింది. ఈసారి పేరు... శిల్పా శెట్టి. 

ఇన్ని పేర్లు ... నితిన్ నటించనున్న "అంధధూన్" రీమేక్ సినిమా కోసమే. బాలీవుడ్ మూవీ "అంధధూన్"లో కీలకమైన నెగెటివ్  పాత్రని టబు పోషించింది.  కొంత విలనిజం ఉండాలి, కొంత సెక్సప్పీల్ తోడవ్వాలి ఆ రోల్ కి. టబు చించేసింది. సో... మొదట ఆమెనే అడిగారు కానీ తెలుగులో అదే పాత్ర చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. తర్వాత అనసూయ, రమ్యకృష్ణ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వర్కౌట్ కాలేదు. సో ... ఇప్పుడు శిల్పా శెట్టిని అప్రోచ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ... శిల్పా శెట్టి కూడా కన్ఫర్మా అనేది ఇప్పుడే చెప్పలేం.

కరోనా గోల అయిపోవాలి. ఆ తర్వాత నితిన్... "రంగ్ దే", "చెక్" అనే రెండు సినిమాలు పూర్తి చెయ్యాలి. అవి అయ్యాక... అంధధూన్ రీమేక్ షూటింగ్ షురూ చేస్తాడు. ఈ తతంగం అంతా పూర్తి అవ్వాలంటే మరో ఆరు నెలలు పైనే పడుతుంది. అప్పుడు చెప్పొచ్చు... శిల్పా శెట్టి గురించి. అప్పటివరకు ఊహాగానాలే. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.