రాజశేఖర్ కూతురు రెడీ

SHIVANI RAJASHEKAR is Ready to rock the silver screen
Tuesday, July 18, 2017 - 17:45

యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ కూతురు రెడీ అయిపోయింది. త్వరలోనే వెండితెరపై మెరుపులు మెరిపించడానికి సిద్ధమైంది శివాని. ఈ మధ్య విడుదలైన శివానీ స్టిల్స్ సోషల్ మీడియాలో ఒక రోజంతా హల్ చల్ చేశాయి. ఇప్పటికే ఫుల్ గా మేకోవర్ అయిన శివానీ.. త్వరలోనే ఓ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఆ మూవీ విశేషాల్ని అతి త్వరలో వెల్లడించబోతున్నారు. 

తల్లితండ్రుల నుంచి నటనను వారసత్వంగా అందుకున్న ఈ భామ కళలు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటూనే, మెడిసిన్ కూడా చదువుతోంది. తన ఆకర్షణీయనమైన పర్సనాలిటీ, అందం తో అందరి దృష్టిని ఇప్పటికే ఆకర్షించిన శివాని, విజయ శాంతి, నయనతార, అనుష్క, ప్రియాంక చోప్రా, దీపిక పదుకోనే లాగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది.

హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల్లో పలువురు హీరోయిన్లను లాంచ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన క్వాన్ కంపెనీ ద్వారా శివాని కూడా త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతోంది.