ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేసిన శోభు, దేవినేని

పైసా ఖర్చు పెట్టకుండా మీడియా అదే పనిగా మన సినిమాకి పబ్లిసిటీ చేయడం ఎలా?
ఈ టెక్నిక్ ఓన్లీ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనికే తెలిసిన విద్య. బాహుబలి నిర్మాతలు వీరు. వారిద్దరూ దీనిమీద ఏకంగా బుక్ కూడా విడుదల చేసి, దాని మీద కూడా మనీ సంపాదించొచ్చు.. రాజమౌళి తీసిన బాహుబలి 2కి దేశమంత క్రేజ్ వచ్చింది. ఒక సినిమాకి ఎంత క్రేజ్ వచ్చినా, అందులో ఎంత పెద్ద సూపర్‌స్టార్ నటించినా..ఆ సినిమాకి యాడ్స్ రూపేణా ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. టీవీలలో ప్రోమోలకి మనీ పే చెయ్యాలి. న్యూస్‌పేపర్‌లలో యాడ్ వెయ్యాలి.
కానీ ఇవేవీ చెయ్యలేదు బాహుబలి 2 నిర్మాతలు. టీవీ9, ఎన్టీవీ వంటి చానెల్స్ ఫ్రీగానే యాడ్‌లు వేశాయి (ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ హక్కుల ప్యాకేజ్‌లో బాగంగా). ఇక ఒక్క ప్రధాన దినపత్రికకి యాడ్ ఇవ్వలేదు. ఐనా పాపం, అన్ని చానెల్స్, పత్రికలు కోట్ల రూపాయల ప్రీ పబ్లిసిటీ ఇచ్చాయి. ఇస్తూనే ఉన్నాయి.
మరి, నిర్మాతలు అస్సలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టలేదా? బ‌్రిటన్‌లో, అమెరికాలో, అంతర్జాతీయ పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్‌కి బాగానే ఖర్చు పెట్టారు (ట). లోకల్‌లో మాత్రం ఆల్ ఫ్రీ. అయితే ఈ టెక్నిక్ అన్ని సినిమాలకి కుదరదు. రాజమౌళి తీసిన ఈ సినిమా మీద జనంలో క్రేజ్ మామూలుగా లేదు. కాబట్టి మీడియా కూడా రోజూ అదే పనిగా వేరే న్యూసే లేనట్లు ఊదరగొడుతోంది. కానీ రేపొద్దున ఆర్కా మీడియా బ్యానర్‌పై శర్వానంద్‌తో తీస్తున్న సినిమా టైమ్‌లో సీన్ వేరుగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాలా!
- Log in to post comments