ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో షూటింగా?

Shooting under extreme conditions?
Monday, June 19, 2017 - 18:30

ఈ మ‌ధ్య వార్త‌ల్లో అధిక శాతం పీఆర్ బులెటిన్స్ ఉంటున్నాయి. హీరోలను ఇంప్రెస్ చేసేందుకో, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ను ఇంప్రెస్ చేసేందుకో పీఆర్వోలు వ‌దిలే ఫీల‌ర్స్‌ని రాసే న్యూస్ అన్న‌మాట‌. ఎంతో కొంత న్యూస్ వాల్యూ ఉండే పీఆర్ బులెటిన్‌లు ఒకే. కానీ మ‌రి ఎండ‌లో హీరో షూటింగ్ చేస్తేనో, వానల్లో ఔట్‌డోర్ షూటింగ్ పెట్టుకుంటేనో.. ఎక్స్‌ట్రీమ్ కండిష‌న్స్‌లో  క‌ష్ట‌ప‌డుతున్నార‌నే వార్త‌లు వండిన‌పుడే ఈ బులెటిన్స్ హాస్య‌స్ప‌దం అవుతుంటాయి.

ఎండాకాలంలో ఎండ‌లు ఎక్కువ ఉంటాయి. వానాకాలంలో ప‌డుతాయి. చ‌లికాలంలో చ‌లి పెడుతుంది. కావాల‌ని అదే సీజ‌న్‌లో ఔట్‌డోర్లో షూటింగ్ పెట్టుకున్నప్పుడు .. ప్ర‌తికూల ప‌రిస్థితులు అంటే మీనింగ్ ఏంటో?