నిక్కర్ బ్యాచ్ హవా తగ్గినట్లేనా?

Shorts culture in Tollywood
Thursday, February 13, 2020 - 14:45

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల "పోష్" కల్చర్ మొదలైంది. హాఫ్ నిక్కర్ (షార్ట్ లు) తొడుక్కొని సినిమా షూటింగ్ లొకేషన్ లకు, సినిమా ఆఫీస్ లకి వచ్చే నిర్మాతలు, సహా నిర్మాతలు, దర్శకుల సంఖ్య పెరిగింది. సినిమా తీయడం అంటే ఏంటో మేము చూపిస్తాము అంటూ... ఆ మధ్య బాగా పోజులు కొట్టింది ఈ బ్యాచ్. ఐతే, హడావిడి తప్ప మేటర్ లేని ఈ బ్యాచ్ కి ఈ మధ్య పెద్ద ఝలక్కులు తగిలాయి. అదేనండి అపజయాలు. 

భారీ షాకులు వరుసగా తగిలేసరికి నిక్కర్ బ్యాచ్ బిచాణా సర్దేసిందట. 

షార్ట్ లు వేసుకొని సెట్ కి వస్తే హాలీవుడ్ స్టైల్ రాదు. అది ఆలోచనల్లో ఉండాలి. ఐడియాస్ ఆ రేంజ్ లో ఉండాలి.