అదొక్కటే ఉంటే సరిపోదు!

Shraddha Das about nepotism
Monday, July 20, 2020 - 09:30

నెపొటిజం/బంధుప్రీతిపై తనదైన శైలిలో స్పందించింది హీరోయిన్ శ్రద్ధాదాస్. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయని, కానీ దానితో కెరీర్ బిల్డప్ అయిపోదని అంటోంది.

"బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఓ చిన్న రోల్ కోసం వెయ్యి ఆడిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవకాశాలు వచ్చే కొద్దీ ఆడిషన్స్ తగ్గుతుంటాయి. అదే బ్యాక్ గ్రౌండ్ ఉంటే నేరుగా అవకాశం వస్తుంది. మొదటి రోజు నుంచే బెస్ట్ స్టాఫ్ అండ్ పీఆర్ టీమ్ ఉంటారు. దీన్ని అంతా యాక్సెప్ట్ చేయాల్సిందే. నెపొకిడ్స్ కు ఇదొక ప్రత్యేక హక్కు లాంటిది."

అలా అని శ్రద్ధాదాస్ నెపొటిజంను వెనకేసుకు రావడం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు, ఏదో ఒక సందర్భంలో అవకాశం ఇస్తారని.. ఆ బ్రేక్ ను ఎలా ఉపయోగించుకుంటామో అదే కెరీర్ అంటోంది.

Shraddha Das

"ఈ నెపొటిజం చర్చలు చూసి విసుగెత్తిపోయాను. ప్రతి ఫీల్డ్ లో ఇది ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వారసత్వంగా ఇది ఇస్తారని చెబుతున్నారు. మరి నా తల్లిదండ్రులు డాక్టర్ లేదా ఇంజనీర్ అయితే.. ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా, చదవకుండా నేను నేరుగా డాక్టర్ అయిపోతానా"