హే హాట్టి.. ఏమెట్టి ట్టి ట్టి ట్టి!

Shraddha Das gets compliments for her hot body
Wednesday, November 27, 2019 - 17:45

అల్లు అర్జున్, కాజల్ కాంబినేషన్ లో ఆర్య2 సినిమా వచ్చి ఇవాళ్టికి పదేళ్లయింది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఓ రేంజ్ లో ట్రెండింగ్ నడుస్తోంది. డికేడ్ ఆర్య2 అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా ఒకెత్తయితే.. పదేళ్లయినా ఆమె అందం తగ్గలేదంటూ మరో హాట్ డిస్కషన్ మొదలైంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కాజల్ కాదు, శ్రద్ధా దాస్.

అవును.. ఆర్య-2లో శ్రద్ధాదాస్ ఓ చిన్న పాత్ర పోషించింది. పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా సినిమా ఫస్టాఫ్ లో చాలాసేపు కనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉందో, పదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆమె అలానే ఉందంటూ శ్రద్ధాదాస్ పై ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ట్రెండింగ్ అలాఅలా కోలీవుడ్, బాలీవుడ్ కు కూడా విస్తరించి... అంతా కలిసి శ్రద్ధాపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

నువ్వు ఏం తింటావో మాక్కూడా కాస్త చెప్పు
నువ్వు ఏం క్రీమ్ వాడతావ్ కాస్త చెప్పు
నీ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి

ఇలా శ్రద్ధాదాస్ ను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జనం. నిజానికి ఎప్పట్లానే ఈరోజు కూడా రొటీన్ గానే తన లైఫ్ స్టార్ట్ చేసింది శ్రద్ధాదాస్. ఆమె ఊహించని విధంగా ఈరోజు ట్రెండింగ్ అయింది. ఆమె పాత పిక్స్, లేటెస్ట్ పిక్స్ ను పక్కపక్కనపెడుతూ చాలా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎక్స్ పెక్ట్ చేయకుండా వచ్చిన ఈ పబ్లిసిటీకి శ్రద్ధా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.