నన్ను ఆ ఇంట్లోకి లాగొద్దు: శ్రద్దాదాస్‌

Shraddha Das responds on urmors about Bigg Boss
Thursday, September 5, 2019 - 22:15

శ్రద్దాదాస్‌కి కోపం వచ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఆమె వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇస్తోందని మీడియా వార్తలు ఆమెని చికాకు పెడుతున్నాయి. ఇప్పటికే ఆమె చాలా సార్లు తోసిపుచ్చింది. ఐనా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లలోనూ, యూట్యూబ్‌ ఛానెల్స్‌లోనూ శ్రద్దాదాస్‌ పేరు మోగుతూనే ఉంది. దాంతో వన్స్‌ అండ్‌ ఫర్‌ ఆల్‌ అన్నట్లు పెద్దగా ఎక్ప్‌ప్లనేషన్‌ ఇచ్చింది. 

మెల్లిగా ఈ పుకార్లకి తెరపడుతుందనుకున్నాను. నేను ఉన్నది బయటే. కానీ ప్రతిరోజు నన్ను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తోసేస్తున్నారు ఈ పుకార్లతో. కొన్ని వార్తలు మరీ హద్దులు దాటాయి. 

అంతేకాదు, ఇంతవరకు బిగ్‌బాస్‌లోకి రమ్మని ఎవరూ అడగలేదని కూడా క్లారిటీ ఇచ్చింది.

నన్ను ఎవరూ అప్రోచ్‌ కాలేదు. ఇది మొదటి విషయం. ఇక రెండోది ..ఏదైనా పని చేయాలి లేదా చేపట్టాలనేది పూర్తిగా అది నాకు నచ్చడాన్ని బట్టి ఉంటుంది. నాకు కంపర్ట్‌గా ఉంటుందా, నాకు నచ్చే బడ్జెట్‌ అవుతుందా, నా ఇమేజ్‌కి పనికొస్తుందా ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. మూడోది...నేను ఇపుడు ఐదు భాషల్లో నటిస్తున్నా. తెలుగులో నటించకపోయినంత మాత్రానా ఖాళీగా ఉన్నాను అని భ్రమించొద్దు. 

ఇలా వరుసగా మూడు ట్వీట్లు వేసి అందరి నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. బిగ్‌బాస్‌ సీజన్‌ త్రీ కాబట్టి మూడు ట్వీట్లతో సమాధానం ఇచ్చిందన్నమాట.