అందర్నీ బెదిరిస్తోన్న శ్రద్ధ

Shraddha Das says she's not part of Bigg Boss 4
Monday, July 27, 2020 - 17:15

"బిగ్ బాస్ 4"లో శ్రద్ధ దాస్ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు శ్రద్ధ దాస్ మౌనం వహించింది. అయితే, ఇప్పుడు  క్లారిటీ ఇచ్చింది ఈ అందాల భామ. తనని ఎవరూ ఇంతవరకు అప్రోచ్ కాలేదని, బిగ్ బాస్ 4తో తనకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 

ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని అందరికీ హెచ్చరిక చేసింది. అంటే.. ఈ భామ ఫైనల్ లిస్ట్ కి చేరుకోదని కన్ ఫమ్ అయినట్లే. 

ఇంతకీ, "బిగ్ బాస్ 4"లో ఎవరు కన్ ఫేమ్ అయ్యారో?

వీళ్ళు ఉంటారు, వాళ్ళు పక్కా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. కానీ ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇంకా రూపొందలేదని టాక్. బిగ్ బాస్ టీం ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలను అప్రోచ్ అయింది. వారితో మాట్లాడుకొంది. అందులో ఎవరు చివరి లిస్టులోకి వస్తారో అనేది చూడాలి. అది ఇప్పుడే తేలదు. 

"బిగ్ బాస్ 4" ఆగస్టు చివర్లో ప్రసారం అవుతుంది. ఇప్పటివరకు మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ కరోనా టైంలో దీనికి మరింత క్రేజ్ ఉంటుంది అని నమ్ముతోంది స్టార్ మా.