పేరుకే స్టార్ డమ్.. పైసా మిగలదు

Shraddha Das talks about Bollywood PR exercise
Tuesday, June 16, 2020 - 17:15

సుశాంత్ మరణంతో బాలీవుడ్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికీ బాలీవుడ్ డార్క్ సైడ్ పై కంగనా రనౌత్, పాయల్ ఘోష్ లాంటి తారలు ఉన్నదున్నట్టు మాట్లాడేశారు. ఇప్పుడు హీరోయిన్ శ్రద్ధాదాస్ మరో అడుగు ముందుకేసింది. బాలీవుడ్ లో నటీనటుల దుర్భర పరిస్థితిని కళ్లకు కట్టింది శ్రద్ధాదాస్.

"మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, నాన్-ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి పరిశ్రమకు వచ్చిన వాళ్లు దుస్తులు, షూస్, పీఆర్ మనీ, స్టయిలిస్ట్, సెలూన్ ఖర్చులు భరించలేరు. ఇవన్నీ మెయింటైన్ చేయలేక ఒక దశలో అసలు ఎందుకొచ్చాం, ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి."

సినిమాలు, అందులో పోషించే పాత్రల కంటే ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకోవడానికి, పార్టీలు ఇవ్వడానికే సమయం, డబ్బు ఖర్చయిపోతుందని అంటోంది శ్రద్ధాదాస్. ఇంత ఖర్చు పెట్టి, ఇంత కష్టపడినా క్రేజ్-సక్సెస్ వస్తుందనే గ్యారెంటీ లేదంటోంది.

"నటించడానికి వచ్చానా లేక షో-ఆఫ్ చూపించుకోవడానికి వచ్చానా అని ఒక దశకు వచ్చేసరికి మనకే అనిపిస్తుంది. మనకు మద్దతుగా 10 నిమిషాలు కూడా నిలబడలేని ఫేక్ ఫ్రెండ్ షిప్పుల కోసం ఎందుకు వ్యక్తిత్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నామో అర్థంకాదు."

Also Check: Shraddha Das Gallery