మందు కొట్టిన సాహో హీరోయిన్

Shraddha Kapoor opens up about her first drinking experience
Monday, August 19, 2019 - 18:45

తను ఫస్ట్ టైమ్ మందుకొట్టిన అనుభూతిని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది హీరోయిన్ శ్రద్ధాకపూర్. ఎప్పుడు మందు కొట్టిందనే విషయాన్ని చెప్పలేదు కానీ, ఆరోజు తన తల్లికి మాత్రం అడ్డంగా దొరికిపోయాని బయటపెట్టింది. సాహో ప్రమోషన్స్ లో  భాగంగా అడిగిన  ప్రశ్నకు ఇలా తన వ్యక్తిగత విశేషాల్ని కూడా బయటపెట్టింది ఈ హీరోయిన్.

"ఫస్ట్ టైమ్ ఓసారి మందు కొట్టాను. తాగి ఇంటికొచ్చాను. మా అమ్మ ముందు చాలా వేషాలేశాను. బాగా నవ్వానట, ఇంకేదో చేశాను. మా అమ్మ మాత్రం చాలా సైలెంట్ గా నా వైపు చూస్తూ ఉండిపోయింది. మొదటిసారి మందు కొట్టినప్పుడు నాకు ఎదురైన అనుభవం ఇది. ఆ తర్వాత అలాంటివేం జరగలేదు. ఆ రోజు మాత్రం బుర్ర బాగా తిరిగినట్టయింది."

 

తను తాగిన విషయాన్ని ఇలా ఓపెన్ గా బయటపెట్టింది శ్రద్ధకపూర్. మొన్నటివరకు నార్త ఇండియన్ వంటకాల్ని మాత్రమే ఇష్టపడే శ్రద్ధాకపూర్, ఇప్పుడు సౌత్ ఇండియా వంటలంటే ప్రాణం అంటోంది. అంతేకాదు.. ఇంట్లో కూడా ఇడ్లీ, వడ, సాంబార్ లాంటివి చేసుకుంటున్నామని తెలిపింది. తనకు సౌత్ ఫుడ్ పరిచయం చేసిన ప్రభాస్ కు మరోసారి థ్యాంక్స్ చెప్పింది.
 

"ప్రభాస్ తో వర్క్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. ప్రభాస్ తో పాటు టోటల్ యూనిట్ మొత్తం అలానే ఉంది. అందుకే రెండేళ్లు పనిచేయగలిగాను. నేను కలిసిన అతి మంచి వ్యక్తుల్లో ప్రభాస్ ఒకడు. ఓ ఫ్రెండ్ లా అతడు చాలా కేర్ తీసుకున్నాడు." 

ఇకపై కూడా సౌత్ లో నటిస్తానని స్పష్టంచేసింది శ్రద్ధ. హిందీ సినిమాలు చేస్తూనే.. కనీసం ఏడాదికి ఒకటైనా సౌత్ లో చేస్తానంటోంది. తన నెక్ట్స్ సౌత్ సినిమా తమిళ్ లోనే ఉంటుందని కూడా ప్రకటించింది.