మ‌ళ్లీ సాహో అంటోన్న శ్ర‌ద్ద

Shraddha Kapoor resumes shoot for Saaho in Hyderabad
Monday, July 30, 2018 - 14:15

శ్ర‌ద్దాక‌పూర్ మ‌ళ్లీ హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. కొంత గ్యాప్ త‌ర్వాత "సాహో" షూటింగ్‌లో పాల్గొంటోంది. రీసెంట్‌గా దుబాయ్‌, అబుధాబిలో యాక్ష‌న్ సీన్లు తీసిన‌పుడు శ్ర‌ద్ద షూటింగ్‌లో పాల్గొన‌లేదు. ఆమెకి సంబంధించిన కీల‌కమైన సీన్లు ఇపుడు హైద‌రాబాద్‌లో వేసిన సెట్‌లో తీస్తున్నారు.

‘సాహో’ షూటింగ్ మళ్లీ ఊపందుకుంది రామోజీ ఫిల్మ్‌ సిటీలో. ఈ షెడ్యూల్ ప‌ర్‌ఫెక్ట్‌గా పూర్త‌యితే.. "సాహో" విడుద‌ల తేదీపై క్లారిటీ వ‌స్తుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుద‌ల చేయాల‌నేది ప్ర‌స్తుత ప్లాన్‌. ఐతే ఆ తేదీకి ఈ సినిమా రెడీ అవుతుందా కాదా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు షూటింగ్ ఉంది. ఆ త‌ర్వాత గ్రాఫిక్స్ ప‌నులు చాలానే ఉన్నాయి.

యూవీ క్రియేషన్స్ సంస్థ‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్దాక‌పూర్‌కిది తొలి తెలుగు చిత్రం.