న‌క్ష‌త్రంలో చంద‌మామ లేదు!

Shriya as item bomb in Krishnavamsi's Nakshatram?
Tuesday, May 2, 2017 - 16:30

శ్రియకు ఐటెంసాంగ్స్ కొత్తకాదు. అప్పుడెప్పుడో వచ్చిన దేవదాసు, మున్నా సినిమాల నుంచి మొదలుపెడితే కొమరం పులి, తులసి వరకు చాలా సినిమాల్లో ఆమె ఐటెంసాంగ్స్ చేసింది. ఇప్పుడీ భామ మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో శ్రియను ఐటెంసాంగ్ కోసం తీసుకున్నారు.

స్పెషల్ సాంగ్ మినహా నక్షత్రం మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు శ్రియ కూడా చేరడంతో ముద్దుగుమ్మల సంఖ్య మూడుకు చేరింది. ఈ వారంలోనే ఈ సాంగ్ షూటింగ్ ఉంటుందట. ఈ పాట కోసం శ్రియను ఒప్పించేందుకు స్వయంగా కృష్ణవంశీ వెళ్లి ఆమెను కలిశాడట. సన్నివేశంతో పాటు సాంగ్ కూడా వినిపించాడట.

నిజానికి ఈ స్పెషల్ సాంగ్ లో కాజల్ డాన్స్ చేస్తుందని మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి. కాజల్ కు స్టార్ డమ్ తీసుకొచ్చింది కృష్ణవంశీనే. ఆ చనువుతో కృష్ణవంశీ సినిమాలో కాజల్ ఐటెంసాంగ్ చేసే అవకాశాలున్నాయని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు శ్రియ ఓకే అయింది.