సీక్రెట్ ఏంటో చెప్పు శ్రియా!

Shriya Saran's long career
Tuesday, June 9, 2020 - 22:00

అప్పుడెప్పుడో 2 దశాబ్దాల కిందట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. 2001 నుంచి సినిమాలు చేస్తోంది శ్రియ. అయినప్పటికీ ఇంకా ఆమెకు క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సంగతి పక్కనపెడితే.. ఇప్పటికీ ఆమెకు భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలొస్తున్నాయి. అదే విచిత్రం.

కెరీర్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది శ్రియ. చిరంజీవి నుంచి తరుణ్ వరకు ఎవ్వర్నీ వదల్లేదు. అందర్నీ కవర్ చేసేసింది. ఇక కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజ్ అనుకున్న ప్రతిసారి ఓ మంచి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతోంది.

2014కే ఔట్ అనుకున్నారంతా. ఎందుకంటే అప్పటికి ఆమెకు తెలుగులో అవకాశాల్లేవు. సరిగ్గా అదే టైమ్ లో "మనం" అనే క్లాసిక్ హిట్ వచ్చి చేరింది. ఆ సినిమాలో శ్రియకు అవకాశం రావడం ఒకెత్తయితే, అది క్లాసిక్ గా నిలవడం మరో ఎత్తు. ఆ తర్వాత కూడా శ్రియ పనైపోయిందంటూ చాలా కథనాలు వచ్చాయి. కట్ చేస్తే.. 2017లో "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా వచ్చింది. బాలయ్య సరసన నటించింది.

ఆ తర్వాత గాయత్రి, పైసా వసూల్, వీరభోగ వసంతరాయలు లాంటి సినిమాలు చేసినా అవేవీ శ్రియకు కలిసిరాలేదు. దీంతో ఆమె కెరీర్ క్లోజ్ అయిందంటూ మళ్లీ గాసిప్స్ అందుకున్నాయి. సరిగ్గా ఇలాంటి టైమ్ లో "ఆర్ఆర్ఆర్" లాంటి భారీ బడ్జెట్ మూవీ పట్టేసింది ఈ భామ.

ఇలా మినిమం గ్యాప్స్ లో పెద్ద ప్రాజెక్టులు సంపాదిస్తూ లైమ్ లైట్లో కొనసాగడం ఈ భామకే సాధ్యం. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. వచ్చి 20 ఏళ్లయినా శ్రియలో ఆ వేడి ఏమాత్రం తగ్గలేదు. అదే నాజూకుతనం, అదే సెక్స్ అప్పీల్. అందుకేనేమో ఇప్పటికీ టాలీవుడ్ ఆమెనే కోరుకుంటోంది.