మరి ఆ రోజుల్లో .. మందు, విందు!

Shriya shares wild party pic
Wednesday, July 8, 2020 - 16:00

ప్రతి హీరోయిన్ కు కొన్ని ప్రైవేట్ మూమెంట్స్ ఉంటాయి. హీరోలు, డైరక్టర్స్ లేదా తోటి హీరోయిన్లతో ప్రైవేట్ పార్టీలు చేసుకోవడం కామన్. అయితే వాటికి సంబంధించిన ఫొటోలు మాత్రం కేవలం వాళ్ల మొబైల్స్ కే పరిమితం. బయటకు పెద్దగా రావు. ఒకవేళ వస్తే మాత్రం అవి సంచలనాలే. కానీ శ్రియ మాత్రం ఏరికోరి అలాంటి ప్రైవేట్ ఫొటో ఒకటి బయటపెట్టింది.

నిర్మాత తనూజ్ గర్గ్ తో ఓ రాత్రి ఫుల్ గా పార్టీ చేసుకొని పీకల వరకు తాగిన టైమ్ లో దిగిన ఓ ఫొటోను శ్రియ షేర్ చేసింది. అక్కడితో ఆగలేదు ఈ బ్యూటీ. "ఆ రోజులే వేరు, ఆ కిక్ మళ్లీ రాదు" అనే అర్థం వచ్చేలా టెక్స్ట్ పెట్టి, ఎమోజీ ఒకటి తగిలించింది.

నిజంగా ఇలాంటి  ప్రైవేట్ ఫొటోలను షేర్ చేసేందుకు తారలు ఇష్టపడరు. కానీ శ్రియ మాత్రం ఏమాత్రం మొహమాటపడకుండా బయటపెట్టేసింది. 

దీనికి కారణం అతడి భర్త ఆండీ కుశ్చేవ్ చాలా ఓపెన్. మొన్నటికిమొన్న ఓ లైవ్ ఛాటింగ్ లో ఓ అభిమాని, శ్రియా నీ ఛెస్ట్ చాలా బాగుంటుందంటూ పోస్ట్ పెడితే.. "అవును.. నిజమే కదా" అంటూ ఆండ్రీ అతడికి వంతపాడడంతోనే అతడు ఎంత బోల్డ్ అనే విషయం అర్థమైపోయింది.