స్విమ్మింగ్ పూల్ లో పిచ్చెక్కించింది

Shriya swiming pic
Friday, November 15, 2019 - 08:45

హాట్ హాట్ ఫొటోలు, వీడియోస్ షేర్ చేయడం శ్రియకు కొత్త కాదు. వయసు పెరుగుతున్నా, ఆల్రెడీ పెళ్లయినా ఈమె అందాల విందు మాత్రం ఆగలేదు. డెయిలీ సీరియల్ లా ప్రతి రోజూ ఏదో ఒక స్టిల్ లేదా వీడియోను వదుల్తూనే ఉంటుంది. అయితే రెగ్యులర్ గా ఆమె షేర్ చేసే వీడియోలన్నీ ఒకెత్తయితే.. కొద్దిసేపటి కిందట శ్రియ షేర్ చేసిన వీడియో మరో ఎత్తు.

స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఆరబోస్తూ ఓ వీడియో షేర్ చేసింది శ్రియ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ వయసులో హీట్ ఎక్కిస్తోందని కొందరు, టూ హాట్ టు హ్యాండిల్ అని మరికొందరు ఈ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. బికినీ వేసుకొని శ్రియ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఈ వీడియోను స్వయంగా ఆమె తల్లి షూట్ చేసింది.

పెళ్లయినా ఓవైపు సినిమాలు కొనసాగిస్తూనే ఉంది శ్రియ. భర్తది రష్యా కావడంతో అటు మాస్కో, ఇటు ముంబయి మధ్య చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆమె తెలుగులో వెంకీ సరసన నటించడానికి రెడీ అవుతోంది. వెంకీ కొత్త సినిమాలో శ్రియను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.