అవును ప్రేమలో పడ్డా

Shruti Haasan admits she was in love with that music director
Friday, May 26, 2017 - 00:30

శృతిహాసన్ బాంబ్ పేల్చింది. ఓ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ తను ప్రేమలో పడినట్టు ఒప్పుకుంది. అయితే ఇది ప్రెజెంట్ మేటర్ కాదు. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంది శృతిహాసన్. ప్రేమ-పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన శృతిహాసన్.. గతంలో ఓ మ్యూజిక్ డైరక్టర్ తో తను ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది.

కెరీర్ స్టార్టింగ్ లో ఓ సంగీత దర్శకుడితో తను ప్రేమలో పడ్డానని, అప్పట్లో దాన్ని ప్రేమ అని భ్రమించానని తర్వాత అది ఆకర్షణ అని తెలుసుకున్నానని అంటోంది ఈ భామ. శృతిహాసన్ స్టేట్ మెంట్ తో ఆ సంగీత దర్శకుడు ఎవరై ఉంటారనే ఆరాలు మొదలయ్యాయి. తన ప్రేమ వ్యవహారంతో పాటు పెళ్లిపై కూడా బోల్డ్ గా స్పందించింది శృతిహాసన్. తనకు పెళ్లి అంటే ఇష్టంలేదని, పెళ్లి-పిల్లలకు లింక్ పెట్టడం సరికాదని స్టేట్ మెంట్ ఇచ్చింది.