బాయ్‌ఫ్రెండ్‌కి పంచెక‌ట్టించిన శృతి

Shruti Haasan and her boyfriend Michael Corsale spotted with Kamal Haasan
Wednesday, December 6, 2017 - 19:30

ఇక దాప‌రికం లేదు. శృతి త‌న ల‌వ్ ఎఫైర్‌ని దాచుకోవ‌డం లేదు. వ‌స్తా నీ వెనుక..ఎటైనా కాద‌న‌కా అంటూ ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమె కొంగు ప‌ట్టుకొనే తిరుగుతున్నాడు.

మొన్న మ‌మ్మీ సారిక‌కి బాయ్‌ఫ్రెండ్‌ని పరిచ‌యం చేసింది శృతి. ముగ్గురూ క‌లిసి ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో డిన్న‌ర్ చేశారు. వీరిద్ద‌రి బంధానికి సారిక గో అహెడ్ చెప్పింద‌ని అపుడే టాక్ వ‌చ్చింది. ఇక ఇపుడు త‌న బాయ్‌ఫ్రెండ్‌ని నాన్న‌కి ప‌రిచ‌యం చేసింది. క‌మ‌ల్‌హాస‌న్ బంధువుల పెళ్లిలో వీరు జంట‌గా ద‌ర్శ‌నం ఇచ్చారు. బంధువులంద‌రికీ త‌న బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌ని ప‌రిచ‌యం చేసింది. సెల్ఫీలు దిగింది.

ఆమె ప్రియుడు..లండ‌న్‌కి చెందిన ఇటాలియ‌న్ న‌టుడు. ఈ ఫారిన్ కుర్రాడు క‌మ‌ల్‌ని, శృతి బంధువుల‌ను ఇంప్రెస్ చేసేందుకు అచ్చ త‌మిళ స్ట‌యిల్‌లో పంచెక‌ట్టడం విశేషం. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ ఓ జంట‌గా మార‌నున్నార‌ని టాక్‌. స‌హ‌జీవ‌నం త‌ప్ప పెళ్లి మీద ఆస‌క్తి లేద‌ని గ‌తంలో శృతి ప్ర‌క‌టించింది. కానీ ఇపుడు మ‌న‌సు మార్చుకున్న‌ట్లు ఉంది.