త్రిష, శృతి ఇద్దరూ ఒకేలా!

Shruti Haasan and Trisha took same decision?
Friday, April 10, 2020 - 23:45

చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కెరీర్ లో ఒక్కసారైనా చిరు సరసన మెరిస్తే చాలనుకుంటారు. అలాంటి చిరంజీవి సినిమా ఆఫర్ కు ఓ హీరోయిన్ నో చెప్పింది.

ఇక పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. పవన్ సరసన ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ మిస్ చేసుకోదు. అసలు పవన్ పక్కన నటించడానికి తెరవెనక లాబీయింగ్ చేసిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న పవర్ స్టార్ సినిమాలో ఆఫర్ ను ఓ హీరోయిన్ తిరస్కరించింది.

అటు చిరంజీవి నటిస్తున్న "ఆచార్య"... ఇటు పవన్ నటిస్తున్న "వకీల్ సాబ్" సినిమాలకు సంబంధించి ఒకేసారి ఇలా ఇద్దరు హీరోయిన్లు తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముందుగా ఆచార్య విషయానికొస్తే.. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ అని మాత్రమే చెప్పుకొచ్చింది.

ఇప్పుడు "వకీల్ సాబ్" వంతు వచ్చింది. ఈ సినిమలో శృతిహాసన్ ను తీసుకోవాలనుకున్నాడు దిల్ రాజు. అలా గబ్బర్ సింగ్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనేది ప్లాన్. శృతిహాసన్ వచ్చేసిందని అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. సరిగ్గా ఇదే టైమ్ లో తనకు "వకీల్ సాబ్" ప్రాజెక్టుకు సంబంధం లేదని ప్రకటించింది శృతిహాసన్. దీంతో అంతా అవాక్కయ్యారు.

ఇలా ఒకేసారి మెగాబ్రదర్స్ ప్రాజెక్టుల నుంచి ఇద్దరు హీరోయిన్లు తప్పుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మణిరత్నం సినిమా ఆఫర్ రావడంతో చిరు సినిమా ఆఫర్ ను త్రిష వదులుకుందని టాక్. మరి శృతిహాసన్, ఎందుకు పవన్ కల్యాణ్ మూవీ ఆఫర్ వదులుకుందో తెలియాల్సి ఉంది.