ముద్దుగుమ్మల ఘుమఘుమలు

Shruti haasan and Yami Gautam share recipes
Monday, March 30, 2020 - 16:30

ఈ లక్డౌన్ పీరియడ్ లో చాలామంది హీరోయిన్లు తమ వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఇంటి పని తామే చేసుకుంటూ (గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం, తుడవడం వంటి పనులు) ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ నిండా నింపేస్తున్నారు. కొందరు కాలం ఏదైనా, సంక్షోభం ఎలాంటిదైనా మాకు తెలిసింది ఎక్స్ పోజింగ్ అని నిరూపిస్తూ హాట్ ఫోటోలను అప్లోడ్ చేసి మన అందరికి పంచుతున్నారు కనువిందు. 

ఇందులో ఇద్దరు హీరోయిన్లు మాత్రం డిఫ్ఫరెంట్. శృతి హాసన్ మాత్రం ప్రతిరోజు ఒక కొత్త వంటకం చేసి ... ఆ రెసిపీని ఇంస్టాగ్రామ్ లో పెడుతోంది. ఆమెకి వంట బాగా వచ్చు అని అందరికి అర్థం అవుతోంది. శృతి వంటకాల రెసిపీ కావాలంటే https://www.instagram.com/shrutzhaasan/ క్లిక్ చెయ్యండి. 

ఇక తెలుగులో 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ యామి గౌతమ్ కూడా 'పహాడీ' వంటకాలు చేస్తోంది. హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలకి చెందిన 'పహాడీ' ఘుమఘుమలు ఇంస్టాగ్రామ్ లో పంచుతోంది.