సబ్బులు తయారుచేస్తున్న శృతిహాసన్

Shruti Haasan making soaps at home
Tuesday, March 24, 2020 - 23:45

లెక్కప్రకారం ఈపాటికి "వకీల్ సాబ్" సెట్స్ పైకి రావాలి. కానీ కరోనా కారణంగా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. స్టార్స్ అంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇక శృతిహాసన్ అయితే ఏకంగా లండన్ రిటర్న్. ఎయిర్ పోర్ట్ లో ఆమె చేతిపై స్టాంప్ కూడా వేశారు. కాబట్టి కచ్చితంగా 2 వారాలు ఎవ్వర్నీ కలవకుండా ఇంట్లో ఉండాల్సిందే. అలా తన స్వీయ నిర్బంధంలో ఆల్రెడీ 10 రోజులు ఆయిపోయాయని చెబుతోంది శృతిహాసన్. సెల్ఫ్ క్వారంటైన్ తనకు కొత్త కాదంటోంది.

ఈ 10 రోజుల ఒంటరి జీవితంలో ఆర్గానిక్ సబ్బులు తయారుచేశానని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇంట్లో వంట చేయడంతో పాటు కొన్ని బేకింగ్ ఐటెమ్స్ కూడా చేశానని స్పష్టంచేసింది. బోర్ కొట్టే సమస్య లేదని, ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు అన్ని పనులు తనే చేయాలని, పని మనిషిని కూడా మాన్పించేశానని అంటోంది శృతి.

అందరూ తనలా శ్రద్ధగా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని పిలుపునిస్తోంది. వివిధ పనుల మీద, వివిధ దేశాలకు వెళ్లిన తన కుటుంబ సభ్యులు కూడా స్వీయనిర్భందంలో ఉన్నారని.. ప్రస్తుతం తామంతా ఒకర్ని ఒకరం కలుసుకోవడం లేదని.. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నామని శృతిహాసన్ స్పష్టంచేసింది. ఇంట్లో తనకు తన పెంపుడు పిల్లి మాత్రమే తోడుగా ఉందని చెప్పుకొచ్చింది.