శృతి హాసన్ డైలీ చేసేదిదే!

Shruti Haasan posts video of her day routine
Friday, July 17, 2020 - 17:00

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏం చేస్తున్నారు?
ఈ హీరోయిన్ ను అడిగినా దాదాపు ఒకేలా సమాధానాలు వస్తాయి. లేచాం, టీవీ చూశాం, పడుకున్నాం అంటూ ఏదేదో చెబుతుంటారు. కానీ శృతిహాసన్ మాత్రం ఈ విషయంలో చాలా వెరైటీ. నిన్నంతా తను ఏం చేసిందో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. ప్రతి సందర్భంలో ఓ వీడియో పెట్టి హల్ చల్ చేసింది.

పొద్దున్నే లేచింది శృతిహాసన్. ఎక్సర్ సైజ్ పూర్తయిన తర్వాత పాస్తా లాంటి టిఫిన్ చేసుకుంది. ఆ ఫొటో పెట్టింది. ఆ తర్వాత ఫ్రెషప్ అయింది. కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుంది. తన కొత్త డ్రెస్ చూపిస్తూ.. లవ్ సింబల్స్ తో ఓ వీడియో రిలీజ్ చేసింది.

మధ్యాహ్నమైంది. మళ్లీ మరో వీడియో రిలీజ్ చేసింది. తన హిందీ సినిమా త్వరలోనే వస్తోందంటూ పాట రూపంలో ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. సాయంత్రానికి ఇంకాస్త హాట్ గా తయారైంది. సెక్సీగా కనిపించే డ్రెస్ వేసుకొని చిన్న వీడియో పోస్ట్ చేసింది.

స్నాక్స్ లో భాగంగా మ్యాంగో రోల్స్ లాగించేసింది. రాత్రి డిన్నర్ టైమ్ కు ఆదాబ్ ఎక్స్ ప్రెస్ నుంచి పార్శిల్ వచ్చింది. అందులో వంటకాలు చూపిస్తూ మరో వీడియో చేసింది. ఫుల్ గా తినేసి పడుకుంది.

ఇలా పొద్దున్నుంచి రాత్రి వరకు తను చేసిన ప్రతి పనిని సోషల్ మీడియాలో పెట్టింది శృతిహాసన్.