బ్యాక్ ఎంతున్నా సరిపోదు: శృతి

Shruti Haasan talks about current hot topic
Wednesday, July 29, 2020 - 14:45

ప్రస్తుతం బాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న నెపొటిజంపై హీరోయిన్ శృతిహాసన్ కూడా స్పందించింది. బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో అవకాశం రావడం చాలా ఈజీ అనే విషయాన్ని ఒప్పుకుంది శృతి. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నెపొటిజం పనిచేయదంటోంది. బ్యాక్ ఎంత సపోర్ట్ ఉన్నా... ఒకసారి పరిచయం అయ్యాక పడాల్సిన కష్టం వేరు అంటోంది ఈ భామ. 

"నేను పెరిగిన వ్యక్తుల కారణంగా, నా తల్లిదండ్రుల కారణంగా పరిశ్రమలో నాకు తలుపులు తెరిచినట్లు నేను అంగీకరించాలి. నా ఇంటిపేరు కారణంగా నాకు అవకాశాలు వచ్చాయి. దానిని నేను కాదనలేను. కానీ నేను జీవితంలో ఏదైనా స్లోగా నేర్చుకునే రకం. నాకు సరైన కమ్యూనికేషన్ మార్గం కూడా తెలియదు. సరైన వ్యక్తులను ఎలా చేరుకోవాలో తెలియదు. ఇంకా చెప్పాలంటే నాకున్న ప్రత్యేక అర్హతల వల్ల నాకు ఈజీగా అవకాశం వచ్చింది. కానీ దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం."

కేవలం బ్యాక్ గ్రౌండ్ తో ఏ ఇండస్ట్రీలో రాణించలేం అంటోంది శృతిహాసన్. టాలెంట్ కూడా ఉన్నప్పుడే పరిశ్రమలో ఎవరైనా నిలదొక్కుకుంటారని చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన "యారా" అనే హిందీ సినిమా రేపు జీ5లో రిలీజ్ అవుతోంది.