షూటింగ్ స్టార్ట్ చేసిన శృతి

Shruti Haasan talks about resuming shoots
Saturday, July 25, 2020 - 15:15

అన్ లాక్ లో భాగంగా ఇప్పుడిప్పుడే నటీనటులంతా సెట్స్ పైకి వస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ శృతిహాసన్ కూడా షూటింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే తను సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం లేదని, తన కజిన్స్ తో కలిసి చిన్న చిన్న షూటింగ్స్ మాత్రం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

"నేను కూడా అప్పుడప్పుడు షూటింగ్స్ చేస్తున్నాను. కాకపోతే అవి సెల్ఫ్ షూట్స్. చిన్న చిన్న ప్రమోషన్స్ కోసం చేస్తున్నాం. మొన్ననే మా సుహాసిని అక్కతో కలిసి ఓ చిన్న షూట్ చేశాం. కానీ చాలా భయమేసింది. ఓవైపు మనసులో కరోనా భయం పెట్టుకొని, మరోవైపు యాక్టింగ్ చేయడం చాలా కష్టం."

లండన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అంతా మూవీ వర్క్స్ స్టార్ట్ చేశారని.. ఇండియాలో మాత్రం సినిమా పనులు ఇప్పట్లో మొదలయ్యేలా లేవని అంటోంది శృతిహాసన్. తను మాత్రం ముంబయిలోనే ఉన్నానని, ఆల్రెడీ కమిట్ అయిన హిందీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే సెట్స్ పైకి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటోంది.