హీరోలను కూడా రాత్రికి రమ్మంటావా?

Shruti Marathe's comments on casting couch experience
Thursday, May 21, 2020 - 11:00

కాస్టింగ్ కౌచ్.. ఇది ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ఒకప్పుడు దీన్ని బయటకు చెప్పడానికి కొంతమంది హీరోయిన్లు భయపడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవు. ఫలానా దర్శకుడు లేదా ఫలానా నిర్మాత తమను కమిట్ మెంట్ అడిగాడంటూ కొంతమంది హీరోయిన్లు ఓపెన్ గా చెబుతున్నారు. మీ-టూ మూమెంట్ వల్ల వచ్చిన ఈ మార్పు ఓ మోస్తరుగా ఫలితాలనిచ్చింది కూడా. ఈ క్రమంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది హీరోయిన్ శృతి మరాథే.

మరాఠీ సినిమాలతో పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఓ నిర్మాత బాగోతాన్ని బయటపెట్టింది. ఓ సినిమా ఛాన్స్ కోసం ఓ నిర్మాతను కలిస్తే, అతడు రాత్రికి రూమ్ కు రమ్మని పిలిచాడని బయటపెట్టింది. అయితే ఏమాత్రం బెదిరిపోకుండా.. ఆ ప్రపోజల్ ను తిప్పికొట్టిందట శృతి. నన్ను పిలిచినట్టే.. అవకాశం ఇస్తానని హీరోలను కూడా రాత్రికి పిలుస్తుంటావా అని గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు తెలిపింది శృతి.

ఆ తర్వాత శృతికి ఆ సినిమా ఛాన్స్ దక్కలేదు. ఆ విషయం ఆనోటా ఈనోటా ఇండస్ట్రీలో అందరికీ తెలిసి, తనకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకొచ్చింది.