యాంకర్ శ్యామల లవ్ స్టోరీ

Shyamala reveals her love story
Tuesday, May 26, 2020 - 10:00

తెలుగు యాంకర్స్ లో పాపులర్ యాంకర్ శ్యామల. ఈమెకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి శ్యామల పర్సనల్ విశేషాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో తన లవ్ స్టోరీని బయటపెట్టింది ఈ అందమైన యాంకరమ్మ.

"మాది ఫస్ట్ లవ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎరేంజ్డ్ మ్యారేజ్ అయింది. నా ప్రేమకథ సినిమాటిక్ గానే ఉంటుంది. నేను, మా ఆయన ప్రేమించుకున్నాం. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం. ఇంట్లో చెప్పాం. పెద్దోళ్లు ఒప్పుకోలేదు. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా మేం పెళ్లి చేసుకున్నాం. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. బాబు పుట్టిన తర్వాత మా ఇంట్లో ఒప్పుకున్నారు."

ఇలా తన ప్రేమకథను ఫటాఫట్ చెప్పేసింది శ్యామల. ప్రస్తుతానికి తన ఫ్యామిలీ లైఫ్ సాఫీగా సాగిపోతోందని చెప్పుకొచ్చిన శ్యామల..

పెళ్లి తర్వాత భర్త తనను బాగా ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం అప్పుడప్పుడు కలుగుతుందని... ఎప్పటికప్పుడు ఇదే విషయాన్ని తన భర్తను అడుగుతుంటానని సరదాగా చెప్పుకొచ్చింది.