సిద్ మేజిక్ ఈసారి అనూప్ తో!

Sid Song in 30 Rojullo Preminchadam song turns viral
Wednesday, February 5, 2020 - 22:15

పాట ఎవరు రాశారన్నది తర్వాత విషయం. దాన్ని ఎవరు కంపోజ్ చేశారనేది కూడా తర్వాత సంగతి. ఆ పాట పాడింది ఎవరనేదే ఇంపార్టెంట్. సిద్ శ్రీరామ్ పాట పడితే ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఆ సింగిల్ హిట్టయి కూర్చుంటుంది. ఈ విషయంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో అయినా.. హుషారు, రాహు లాంటి చిన్న సినిమాలైనా ఒకటే. ఇప్పుడీ యంగ్ సింగర్ మరో సినిమాను కూడా టాప్ లో నిలబెట్టాడు.

యాంకర్ ప్రదీప్ హీరోగా మారుతూ "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. నీలి నీలి ఆకాశం అనే లిరిక్స్ తో సాగిన ఈ పాటను తాజాగా విడుదల చేశారు. మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ఈ పాట, ఇలా విడుదలై అలా ఇనిస్టెంట్ హిట్ గా మారింది.

సిద్ శ్రీరామ్ ఆలపించగా.. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాట యూట్యూబ్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏమాత్రం హైప్ లేని ఓ చిన్న సినిమా, సిద్ శ్రీరామ్ పాటతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారిపోయింది. అలా ఈసారి అనూప్ తో కలిసి మేజిక్ చేశాడు సిద్. అన్నట్టు ఈ పాటను చంద్రబోస్ రాశాడు.